తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్‌కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఎస్‌కే సుల్తానియా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.రామకృష్ణారావు బాధ్యతలు నిర్వర్తించారు. సీఎస్ శాంతి కుమారి ఇటీవల రిటైర్ అవ్వడంతో ఆమె స్థానంలో నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును ప్రజాభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా