ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బార్ అసోషియేషన్ కార్యదర్శి శాయిరెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు మదుసూదన్, బార్గవ్, పులిగారి గోవర్దన్ రెడ్డి, ఉపేందర్, కొంతం గోవర్దన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కొమరయ్య, కృష్ణ, నిషికాంత్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.