వన్య ప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటికి దోసకాయ, పుచ్చకాయలను ఆహారంగా పెట్టాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మంగళవారం ఆమె అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నదని, కాబట్టి అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అడవుల్లో, జూపార్కుల్లో జంతువులకు తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు.