మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : జడ్పీ సీఈఓ అప్పారావు

నర్సరీల్లో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట‌ జడ్పీ సీఈఓ అప్పారావు సిబ్బందిని హెచ్చరించారు. గురువారం నేరేడుచ‌ర్ల మండల పరిధిలోని సోమారం, బూరుగులతండా, బోడలదిన్న గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నర్సరీల నిర్వహణపై కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి, ఏపీఓ నాగేందర్‌, ఏపీఎం శేఖర్‌, కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు.