నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని సన్మానించిన ఎండీ సజ్జనార్‌

విధి నిర్వహణలో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగులను వారికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. మూడు వేర్వేరు ఘటనల్లో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగులను వారికి అందజేసిన సూర్యాపేట, మియాపూర్‌-2 డిపోలకు చెందిన సిబ్బంది కె.అంజయ్య, యాకుబ్‌ పాషా, ముబీన్‌, రమేశ్‌లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభినందించారు. శుక్రవారం బస్‌ భవన్‌లో వారిని ఉన్నతాధికారులతో కలిసి సన్మానించారు. ప్రయాణికులు పొగొట్టుకున్న బ్యాగులను తిరిగి వారికి అందజేయడం ఆర్టీసీ సిబ్బంది నిజాయితీకి నిదర్శనమన్నారు.