కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
