నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, (World Environment Day – June-05)

గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (June 05th) ప్రపంచ పర్యావరణ దినోత్సవం, (world environment day) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్‌ 5): ఐక్యరాజ్యసమితి మొదటి సారిగా పర్యావరణానికి సంబంధించిన సమావేశాన్ని జూన్‌ 5, 1972న స్టాక్‌హోం లో నిర్వహించింది. నాటి నుండి ప్రతి సంవత్సరం జూన్‌ 5న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జాన్ 5వ తేదీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ (సంయుక్త రాష్ట్రాల పర్యావరణ కార్యక్రమం – యునెప్) చే ప్రపంచ పర్యావరణ దినం (డబ్ల్యు.ఇ.డి) గా నిర్వహించ బడుతోంది. ప్రతికూలమైన పర్యావరణ సంబంధిత చర్యకై యు.ఎన్. యొక్క అతి పెద్ద ప్రపంచ ఉత్సవంగా, వేడుకగా ఇది నిర్వహింపబడుతోంది.

అడవులు ఒకింట మూడొంతుల భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా అతి ముఖ్యమైన విధులను నిర్వహిస్తూ మరియు సేవలనందిస్తూ, అనేక సాధ్యతలతో భూమిని సజీవంగా ఉంచుతాయి. వాస్తవానికి 1.6 బిలియన్ ప్రజలు వారి జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడి ఉన్నారు. వాతావరణంలోకి ప్రాణవాయువును విడుదల చేస్తూ, బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డేయాక్సైడ్)ను నిలువచేస్తూ వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా మనం చేస్తున్న పోరాటంలో ఇవి కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ వెలకట్టలేని జీవావరణ, ఆర్ధిక, సాంఘిక మరియు ఆరోగ్య సంబంధిత లాభాలున్నప్పటికీ, మనం బతకడానికి అవసరమైన అడవులనే మనం నాశనం చేసుకుంటున్నాము.

ప్రజలలో అవగాహన పెంచడానికి ఎన్నో సభలు సమావేశాలు, చిత్ర ప్రదర్శనలు జరిగాయి. వాతావరణం చక్కగా పరిశుభ్రంగా వుంచటానికి అధికార వర్గాలవారు ఎన్నో సదుపాయాలు చేస్తూ వుంటారు. వాటిని ఉపయొగించుకొని వాతావరణంలో కాలుష్యం పెరగకుండా చూసుకొవలసిన బాధ్యత మనపై కూడా వుంది. మన ఇల్లే వైకుంఠం మనవాకిలే కైలాసం అనుకొని మన ఇంటిలోని చెత్త చెదారం పక్కవారి వాకిట్లోకి వూడ్చేసి ఏమీ ఎరగనట్లు వుండడం సబబుకాదు. భవనాల నిర్మాణం కోసం చెట్లు కొట్టేస్తారు, రోడ్డు వెడల్పు చేయడం కోసం చెట్లు కొట్టేస్తారు, ఎలెక్త్రిక్ తీగలకి అడ్డం వస్తున్నాయని చెట్లు కొట్టేస్తారు. తాజాగాలి, చల్లటి నీడ మనకి పక్షులకి కూడా కరువై పోతున్నది. మనకి అవసరం లేదు అనుకోగానే ఎక్కడపడితే అక్కడ ఆ వస్తువును పారవేయడంలో వెనుకాడరు. అరటి పండు తొక్కలు, కాగితాలు, ప్లాస్టిక్ సంచులు రోడ్ల మీద విహారం చేస్తూ వుంటాయి. చీకట్లో నడిచేటప్పుడు అవే మనకే ప్రమాదాలు తెచ్చి పెడతాయి. మన భారతీయులు విదేశాలలో వుంటే ఎంతో క్రమశిక్షణతో మెలుగుతారు, వారు అక్కడచూచి వచ్చాక అయినా ఇక్కడ అలాంటి క్రమశిక్షణతో మెలగాలని అనిపించేవాళ్ళు తక్కువ. విదేశాలకు వెళ్ళి చూచి వారి శుభ్రత, వారి కార్యాచరణాను అనుకరిస్తే ఎంత బాగుంటుంది. అయినా మన దేశంలో మనము శుభ్రముగా వుండమా? వుంటాము, కాని ఎంతసేపూ ఎదుటి వారు పనిచెయ్యాలి అని చూస్తారు. మన పని మనమే చేసుకోవాలి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నంత కాలం ఇతరులతో పనిచేయించుకోకూడదు, అనుకొంటే శుభ్రత అలవాటవుతుంది. వాల్లు చేస్తారు అనుకొంటే శ్రమ తెలియదు. మనచేత్తో మనపని అనే సూత్రం చిన్నప్పటి నుండి అలవాటయితే ఎంతో మంచిది. ఇంట్లో వున్నవాళ్ళు ఈఇల్లు మనది దీన్ని శుభ్రంగా వుంచాలి, అనుకోవాలి. బడికి వెడితే ఈబడి మనది దీన్ని శుభ్రంగా వుంచాలనుకోవాలి. పార్క్ కువెడితే ఈపార్క్ లో మనం రోజూ ఆడుకొంటాము, దీన్నిశుభ్రంగా వుంచాలి అనుకొవాలి, ఆఫీసుకు వెళ్ళినా, సినిమా హాలుకు వెళ్ళినా, రైల్ ఎక్కినా, గుడికి వెళ్ళినా అదే భావంతో వుండి, మన పిల్లలకి అదే నేర్పించాలి. ఆదిమ వాసులకి పర్యావరణం గూర్చి చెపుతే తెలియలేదట. ప్లాస్టిక్ సంచులు పశువులు తింటే వ్యాధులు వస్తాయి అంటే ఒకామె పొలాలలో ఉన్న సంచులన్నీ ఏరుకొని వచ్చి మడతపెట్టి దిండులా కుట్టిందట. పంచాయతీవారు ఆమెకు బహుమతి ఇచ్చారట. చెత్త వేయడానికి కుండీలు పెడితే అందులో చెత్త వెయ్యకుండా పక్కన పడవేస్తారెందుకో అర్ధం కాదు. అందరూ చెత్త కుండీలో వేయాలనే రూల్ తెలిసిన వాళ్ళే.

మొక్కలు పెంచండి.. పర్యావరణాన్ని కాపాడండి..
గాలి, నీరు, నిప్పు, నేల, లేకపోతే ప్రకృతే లేదు. ఇందులో ముఖ్యంగా నేలపై చూసేది మనకు నిత్యం కనపడేటివి నీరు, నేల, అడవి. ఇవి సమృద్ధిగా ఉండేది మన దేశంలోనే. మన దేశంలో అడవులు, అడవులతోపాటు వన్యప్రాణులు, సెలయేళ్ళు. ముఖ్యంగా మన దేశంలోని అడవులలో వివిధ రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని పర్యావరణ శాస్త్రం చెపుతోంది. వీటి గురించి తెలుసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
మనిషికి వన్యప్రాణులతో చాలా దగ్గరి సంబంధం ఉంది. వన్యప్రాణులు లేకుంటే పర్యావరణం కారణంగా మనిషి ఆర్థిక వృద్ధి జరిగేదే కాదు. దీనికి తోడు జనాభా ఓ వైపు పెరిగిపోతోంది. జనాభా పెరిగిపోతుంటే ఆ ఫలితం వన్యప్రాణులపై పడుతోంది.

వృక్షో రక్షతి రక్షిత: ప్రస్తుతం పర్యావరణం అతలాకుతలమౌతోంది. అడవులు అత్యధికంగా ఉన్న మన దేశంలోనే అడవులను నరికివేస్తున్నారు. అందులోనున్న కలపను తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. దీంతో అడవులు తరగిపోతున్నాయి. దీనికి తోడు వన్యప్రాణుల సంఖ్యకూడా అంతరించిపోతోంది.

పర్యావరణంలో వస్తున్న మార్పులకారణంగా సరైన సమయానికి వర్షాలు రావడం లేదు. వర్షాలు కురవక పోవడంతో సరైన పంటలు చేతికి అందడం లేదు. ప్రకృతి పరంగా వచ్చిన మార్పుల కారణంగా పర్యావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో ప్రకృతి పరంగా లభించే నీటిని ప్రస్తుతం డబ్బులిచ్చి కొనుక్కునే దుస్థితికి రావడానికి మానవుడే ప్రధానమైన కారణం.

రోజురోజుకు పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతోంది. అడవులున్న చోట నేడు ఇండ్లుంటున్నాయి. మానవ స్వార్థం కారణంగా ఇలా జరుగుతోంది. చెట్లను నరికిన తర్వాత మళ్ళీ మొక్కలను నాటాలనే ఆలోచన నేటి మానవాళికి లేకపోవడమే ప్రకృతి వైపరీత్యాలకు కారణంగా మారుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆవేదన చెందుతున్నారు.

దీనికి మనిషి తన కర్తవ్యంగా చేయాల్సిన పని ఏంటంటే… మీరు ర్యాలీలు చేసినంత మాత్రాన ఫలితం ఉండదు. ప్రతి ఒక్కరుకూడా మీ ఇంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వీలైనంత ఎక్కువగా మొక్కలు నాటి వాటి పెంపకం బాధ్యతను కూడా మీరే తీసుకోవాలి.

మీ ఇంటి చుట్టూ మొక్కలు పెంచండి. దీంతో మీ ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. వేడి, దుమ్ము, ధూళి నుంచి మిమ్ములను మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో మొక్కలు, చెట్లు ఉంటే వాటిపై వచ్చి వాలేందుకు పక్షులు కూడా వస్తాయి. ఇలా పక్షులకు మీరు పరోక్షంగా ఆశ్రయమిచ్చినవారవుతారు. వాటికి ఆహారం కూడా అందించినవారవుతారు.

ప్రముఖంగా పట్టణాలు, నగరాలలో నివసించేవారు పక్షులపై ప్రత్యేక శ్రద్ధను కనపరచండి. అలాగే పెంపుడు జంతువులపై కూడా కాస్త దృష్టి పెట్టండి. ఉదాహరణకు రామచిలుకలు, పావురాలు, కాకులు, గద్దలు, నెమళ్ళు, చిలుకలు, పిచ్చుకలు, ఇతర పక్షిజాతి. అలాగే పశువులు.. దేశంలో ప్రముఖంగా పూజింపబడే పశువు ఆవు, ఇంటి యజమానికి విశ్వాసంగా ఉండే జంతువు కుక్క, గుర్రం, గాడిద, మిగిలిన పెంపుడు జంతువులకు కూడా చోటు కల్పించి వాటి పోషణ భారాన్ని మీరు చేపట్టండి. మీకు వీలైనన్ని చెట్లను పెంచండి. అవి మిమ్మల్ని కాపాడుతాయి. ఇది ప్రతి ఒక్కరం తప్పక పాటించాల్సిన అవసరం ఉంది.