తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ


తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులిచ్చారు. శిఖా గోయల్‌ను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు. చారుసిన్హాకు సీఐడీ అదనపు డీజీగా బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్‌ సిటీ ఎస్‌బీ డీసీపీగా ఉన్న ఎస్‌.చైతన్యకుమార్‌ను సౌత్‌ఈస్ట్ జోన్‌ డీసీపీగా నియమించగా, ఆ పదవిలో ఉన్న పాటిల్‌ కాంతిలాల్‌ సుభా్‌షను కొమురంభీం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. మైనారిటీ వెల్ఫేర్‌లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న తఫ్సీర్‌ ఇక్బాల్‌ను చార్మినార్‌ జోన్‌ డీఐజీగా నియమించారు. డీవీ శ్రీనివాసరావును మెదక్‌ ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న అభిలాష్‌ బిస్త్‌ను తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా నియమించారు.