చేనేత పర్రిశమ అభివృద్ధికి కృషి : రాష్ట్ర‌ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ

పోచంపల్లి ఇక్కత్‌ వ్రస్తాలకు మంచి డిమాండ్‌ ఉన్నదని, మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తే చేనేత పర్రిశమ, చేనేత కళాకారులను కాపాడిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం సతీమణి సుధాదేవ్‌వర్మతో కలిసి ర్రాష్ట గవర్నర్‌ భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. చేనేత కార్మికుల యోగ క్షేమాలు, చేనేత వృత్తి సాధక బాధకాలు స్వయంగా తెలుసుకునేందుకు గవర్నర్‌ చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. చేనేత మగ్గంపై తయారు చేస్తున్న పోచంపల్లి ఇక్కత్‌ ఉత్పత్తులను పరిశీలించారు. కార్మికుల సంక్షేమం, జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూరిజం పార్క్‌లోని మ్యూజియంలో దారం నుంచి వ్రస్త తయారీ ప్ర‌క్రియ‌ల‌ను పరిశీలించారు. ప‌లువురు చేనేత కళాకారులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. ఇటీవల ప్ర‌పంచ సుందరీమణుల సందర్శనతో 30 శాతం అమ్మకాలు పెరిగాయని తెలియడం సంతోషక‌ర‌మ‌న్నారు. పోచంపల్లి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యంతో పాటు మార్కెటింగ్ సౌక‌ర్యం తీసుకువచ్చేందుకు అహ్మదాబాద్‌లోని ఎన్ఐటీ, ఐఐటీల‌ సహకారంతో స్థానిక నేత కార్మికులతో కలిసి అధ్యయనం చేయాలని, ప్ర‌త్యేకించి మార్కెటింగ్‌, డిజైనింగ్‌, డైయింగ్‌, అన్ని విషయాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కత్‌ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అంతేకాక ప్రింటెడ్ చీరలతో చేనేత పర్రిశమకు నష్టం వాటిల్లుతుందని కార్మికులు చెబుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పోచంపల్లి ప్ర‌భుత్వ పాఠశాలకు డిజిలైటేషన్‌ కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు. చేనేత కార్మికుల వైద్య చికిత్స కోసం లాంబార్డ్‌ హెల్త్‌ కార్డు ఏర్పాటు, చేనేత పర్రిశమ అభివృద్ధిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

అన్ని విధాల నేత కార్మికుల‌కు అండ‌

రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రిన్సిప‌ల్ స్రెకెటరీ శైలజ రామయ్యర్‌ మాట్లాడుతూ.. ర్రాష్ట ప్ర‌భుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. త్రిఫ్ట్ స్కీం, ఇన్సూరెన్స్‌ స్కీం, రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాల ద్వారా సహకారం అందిస్తుందని తెలిపారు. నేత కార్మికుల కోసం ప్ర‌త్యేకించి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డును ప్ర‌తి ఏడాది ఇస్తున్నామని, ఇందులో భాగంగా రూ.25 వేల న‌గ‌దు అంద‌జేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. టెస్కో ద్వారా చేనేత మెటీరియల్‌ సేకరిస్తున్నామని, ఈ సంవత్సరం పోచంపల్లి మెటీరియల్‌ను రూ.6 కోట్లతో సేకరిస్తున్నట్లు తెలిపారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవ‌ల ప్ర‌పంచ సుంద‌రీమ‌ణుల సంద‌ర్శ‌న‌తో పోచంప‌ల్లికి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌చారం వ‌చ్చింద‌ని, తాజాగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రాక‌తో ఈ ప్రాంతం మ‌రోసారి ప్రాచుర్యం పొందింద‌ని తెలిపారు. ర్రాష్ట ప్ర‌భుత్వం చేనేత కార్మికులకు యాద్రాది భువనగిరి జిల్లాకు త్రిఫ్ట్ పథకం కింద రూ.90 కోట్లు ఇచ్చిందని తెలిపారు. అలాగే రుణమాఫీ కింద ఆర్థిక సాయం ఇవ్వనుందని, నేతన్న భరోసా, నేతన్న భీమా వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. యాద్రాది జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఐఐటీ, ఎన్‌ఐటీ ద్వారా మరింత మెరుగైన విధంగా పోచంపల్లి ఉత్పత్తులు పెంపొందించుకునేందుకు అవకాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. నేత‌న్న బీమా పథకం కింద గర్దాస్‌ ఉపేందర్‌, వల్లకాటి భాగ్యలక్ష్మి, వనం యాదగిరి లబ్ధిదారులకు రూ.5 లక్షల బీమా చెక్కులు, నేతన్న పొదుపు స్కీం కింద రూ.2.17 కోట్ల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యాద్రాది భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్షయాదవ్‌, జిల్లా స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కరరావు, ర్రాష్ట గవర్నర్‌ ఓఎస్డి భవానిశంకర్‌, భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేఖబాబురావు, ర్రాష్ట చేనేత జౌళి శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, ఇందుమతి, రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మ, జిల్లా ఏడి శ్రీ‌నివాస‌రావు, చౌటుప్పల్‌ ఆర్డీవో శేఖర్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, చౌటుప్పల్ సీఐ రాములు, తాసీల్దార్ శ్రీ‌నివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, స్థానిక ఎస్ఐ భాస్కర్‌రెడ్డి, ర్రాష్ట చేనేత నాయకులు తడక వెంకటేశ్‌, తడక రమేశ్‌, టై అండ్‌ డై అసోసియేషన్‌ అధ్యక్షుడు భారత లవకుమార్‌, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, అధికారులు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.