తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

 తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌ను నియమించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమించింది. టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జే శంకరయ్య, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును నియమించింది. 

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఈ నవీన్‌ నికోలస్‌, సమాచార శాఖ కమిషన్‌ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా కిల్లు శివకుమార్‌ నాయుడు, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, మహిళా-శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సృజనకు అదనపు బాధ్యతలు, నిజామాబాద్‌ కలెక్టర్‌గా టీ వినయ్‌ కృష్ణారెడ్డి, వ్యవసాయ సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్‌ శివశంకర్‌ని నియమించింది. శివశంకర్‌కు విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్‌కు అదనపు బాధ్యతలు ఇవ్వగా.. సిద్దిపేట కలెక్టర్‌గా కే హైమావతి, సింగరేణి డైరెక్టర్‌గా పీ గౌతమ్‌ను నియమించింది. మత్స్యశాఖ డైరెక్టర్‌గా కే నిఖిల, పర్యటకశాఖ ఎండీగా వల్లూరి క్రాంతి, ఆరోగ్యశ్రీ హెల్త్‌ ట్రస్ట్‌ సీఈవోగా పీ ఉదయ్‌ కుమార్‌, టీజీపీఎస్సీ కార్యదర్శిగా ప్రియాంక ఆల, సంగారెడ్డి కలెక్టర్‌గా పీ ప్రావీణ్యను బదిలీ చేసింది.