హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరి

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొనసాగిన అనుదీప్‌ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ చేశారు. మేడ్చల్‌ కలెక్టర్‌గా కొనసాగిన గౌతమ్‌ను సింగరేణి సంస్థ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

ఈ స్థానానికి మిక్కిలినేని మను చౌదరిని కలెక్టర్‌గా నియమించారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా కొనసాగిన స్నేహ శబరీష్‌ను హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా, శివకుమార్‌ నాయుడును ఇరిగేషన్‌ శాఖలో భూసేకరణ విభాగం కమిషనర్‌గా నియమించారు. హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో వీఎస్‌ఎన్వీ ప్రసాద్‌ను నియమించారు.