ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా  బాధ్యతలు స్వీకరించిన అనుదీప్‌ దురిశెట్టి 

ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా అనుదీప్‌ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా హైదరాబాద్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్‌ దురిశెట్టి ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ అయిన విషయం విదితమే.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయన తన చాంబర్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అనుదీప్‌ను.. అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో దీక్షారైనా, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్లు, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.