తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీపీఎఫ్‌సీఎల్)కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతం నవీన్ మిట్టల్ కొనసాగుతున్నారు. నిరుడు సైతం ఇంధనశాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారినే మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ప్రభుత్వం నియమిస్తూ వస్తోంది.