మైలార్‌దేవ్‌పల్లిలో ప్లాస్టిక్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది శాస్త్రిపురంలోని ప్లాస్టిక్‌ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయి. మంటల్లో సామాగ్రి పూర్తిగా కాలిపోయిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.