తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు స్థానచలనం కల్పించింది. ఒకేసారి 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న టీ రాజేశ్వర్‌ను మహబూబాబాద్ కమినషర్‌గా బదిలీచేశారు.
