తెలంగాణ రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్‌ కాలేజీలు

ఐదు కొత్త పీజీ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) యూజీ లేకుండా నేరు గా పీజీ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది.

కింగ్‌ కోఠి, మిర్యాలగూడ, భద్రాచలం, బాన్సువాడ, పెద్దపల్లిలో ప్రభుత్వ పీజీ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. 200 పడకలతో ఉన్న దవాఖానాలను పీజీ కోర్సుల కోసం బోధనాసుపత్రులుగా మార్చనున్నారు.