సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కింద ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
