ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం కేసీఆర్ హరిత జన్మదిన వేడుకలు

సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్ , మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్ , బెండీగో, బల్లార్ట్ నగరాలలో టీఆర్ఎస్ ఆస్ర్టేలియాశాఖ సీఎం హరిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరూ ఒక్కొక్క మొక్క నాటి సీఎం కేసీఆర్‌ హరిత జన్మదిన వేడులను ఘనంగా నిర్వహించారు. రాజేశ్‌ రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రవి యాదవ్‌, శ్రీకాంత్‌రెడ్డి, సాయిరాం ఉప్పు, రవి సాయల ఆధ్వర్యంలో అడిలైడ్‌, బ్రిస్‌బేన్‌, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రాలో సీఎం పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నాడు ప్రాణ త్యాగానికి సిద్దపడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి నేడు రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో పయనింపజేస్తున్న సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కాసర్ల నాగేందర్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌ చింతామణి, రవి శంకర్‌ ధూపాటి, లక్ష్మణ్‌ నల్లాన్‌, పరశురామ్‌ ముతుకుల, సంగీత ధూపాటి, జశ్వంత్‌ కొడారపు, ప్రకాష్‌ హనుమంత, వరుణ్‌ నల్లెల్ల, సాంబశివారెడ్డి, అజాజ్‌ మొహ్మద్‌, గుల్షన్‌, స్మృతి రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.