సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిది మంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ (బుధవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చివేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాద సమయంలో కాలి బుడిదై ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇప్పటికే వందశాంపిల్స్ సేకరించిన డీఎన్ఏ మ్యాచ్ కాలేదని అధికారులు తెలిపారు. ఎనిమిది మంది కార్మికుల కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. మూడు నెలల తర్వాత తిరిగి రావాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అప్పటి వరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.