నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ENC) మురళీధర్‌రావును ఏసీబీ అదుపులోకి తీసుకున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదుచేశారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంపై దాడి చేసిన అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌తోపాటు మొత్తం పది చోట్ల మురళీధర్‌రావు బంధువులు, సన్నిహితుల ఇండ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎన్సీగా పనిచేస్తుండగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
