
మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్..కేజ్రీవాల్‌తో ప్రమాణం చేయించారు. కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.