గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా కుడ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ఆధ్వర్యంలో 66 మొక్కలు నాటడం జరిగింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ 66 వ జన్మదినం పురస్కరించుకొని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా కుడ ఆక్సిజన్ పార్క్, వరంగల్ లో 66 మొక్కలు నాటడం జరిగింది. కుడ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది . ఈ సందర్భంగా కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని 66 మొక్కలు నాటడం జరిగింది ఈ మొక్కలు తన వ్యక్తిగత పర్యవేక్షణలో ఎదిగే అంతవరకూ బాధ్యత తీసుకుంటారని కెసిఆర్ దూరదృష్టి తో భావితరాలకు మంచి వాతావరణం అందించే దిశగా, బంగారు భవిష్యత్తుకి తీసుకున్న నిర్ణయం హరితహారం. ఈ కార్యక్రమానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కానుకగా 66 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుడా సిబ్బంది, మిత్రులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.