సమాచార భవన్ (FDC) కార్యాలయంలోఘనంగా బోనాల ఉత్సవాలు

సమాచార పౌర సంబంధాల శాఖ సమాచార భవన్, మాసబ్ ట్యాంక్ లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపులు, బోనాల సమర్పణ తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సమాచార భవన్ (FDC Complex) కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో బోనాల సంబరాలు జరిగాయి.

సమాచార శాఖ ప్రత్యేక కమీషనర్ శ్రీమతి సి.హెచ్.ప్రియాంక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఊరేగింపులో డప్పు విన్యాసాలు, పోతరాజుల ప్రదర్శనలతో పలు కళారూపాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో సమాచార శాఖ సంచాలకులు ఎల్.ఎల్.ఆర్. కిషోర్ బాబు, అదనపు సంచాలకులు డి.ఎస్.జగన్, జాయింట్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్, కె.వెంకటరమణ, సమాచార శాఖ మాజీ డైరెక్టర్ సుభాష్ గౌడ్, CIE రాధాకిషన్, డిప్యూటి డైరెక్టర్లు యం.మధుసూధన్, సి.రాజారెడ్డి, జి.ప్రసాద్ రావు, కె.వి.సురేష్, RIE జయ రామ్మూర్తి, సహాయ సంచాలకులు ప్రణీత్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, బిమల్ దేవ్, Dy.I.E నర్సింహా గౌడ్, అకౌంట్స్ ఆఫీసర్లు పద్మ, హేమ, TNGOs నాయకులు అనిల్, జితేందర్ , దుర్గప్రసాద్ తదితరులు హాజరయ్యారు.