కుల గణన దేశ దిశను మారుస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • సర్వే విశ్లేషణ ఆధారంగా సంపద, వనరులు ఇంకా అందనీ వర్గాలకు చేరవేస్తాం
  • దేశంలో ఎక్కడా ఇలాంటి సైంటిఫిక్ సర్వే జరగలేదు
  • Seeepc సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సర్వే ఆధారంగా విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సాయంత్రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో seeepc సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులు, ఎలాంటి ముద్రలు లేని వివాదరహితులను కమిటీ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సర్వే దేశంలో ఇప్పటివరకు ఎక్కడ జరగలేదని ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. భారత్ జూడో పాదయాత్ర లో భాగంగా మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల సర్వే చేపట్టిందని తెలిపారు. ఈ సర్వే చేపట్టాలని ఆ బాధ్యతలను మొదట ప్రణాళిక శాఖకు ఇవ్వడంతో కొత్త ఆందోళన చెందాము కుల సర్వే దేశంలో ఎక్కడా జరగలేదు. బీహార్ లో జరిగిన న్యాయస్థానాల్లో బ్రేకులు పడ్డాయి అని వివరించారు. కుల సర్వే పై క్యాబినెట్ మొత్తం సీరియస్ గా చర్చించి, ప్రశ్నాపత్రాలు రూపొందించి, లెక్కింపు, బ్లాక్ ల ఏర్పాటు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగించుకొని సర్వే నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెడితే సభ్యులు అనేక రకాల ప్రశ్నలు అడిగారు తప్ప లోపం ఉందని ఎవరూ చెప్పలేదని డిప్యూటీ సీఎం వివరించారు.

కుల గణన సమాచారం వచ్చిన తర్వాత ఏం చేద్దాం, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అని సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ సభ్యులు చర్చించి దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచ ఐలయ్య, ప్రవీణ్ చక్రవర్తి, తోరట్ వంటి మహామవులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. సమాజం పట్ల అనురాగం, నిబద్ధత, ప్రేమ ఉన్న వ్యక్తులు కమిటీలో సభ్యులుగా ఉన్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.

కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుల గణన కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతమంది రెడ్లు ఉన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని బాధ్యతతో పని చేయడంతో సర్వే నిర్వహణ, విశ్లేషణ కార్యక్రమంలో విజయవంతం అయ్యామని డిప్యూటీ సీఎం తెలిపారు. కమిటీ సభ్యులు పడిన కష్టం చెప్పడానికి తనకు మాటలు రావడంలేదని, సామాజిక న్యాయం, సమానత్వం, సంపద పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. విలువైన సమయాన్ని కేటాయించి నివేదికను విశ్లేషించిన మేధావులకు ధన్యవాదాలు వారి సూచనలను ప్రభుత్వం కచ్చితంగా వినియోగించుకుంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.