ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణుల మండలి సభ్యులు బానోత్ రవికుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు మండలంలోని బ్రాహ్మణ పల్లి కెజిబివి లో మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణుల మండలి సభ్యులు బానోత్ రవికుమార్. ఈ సందర్భంగా బానోత్ రవికుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కారణ జన్ముడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యార్థులకు అనేక రకమైన విద్య అభివృద్ధి కోసం విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను కార్పొరేట్ స్థాయిలో అభివృధ్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆయు రారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని పదికలలపాటు తెలంగాణ ప్రజలకు సేవచేసే బాగ్యానికి కల్పించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్టీవీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బానోత్ రామన్న నాయక్, ప్రిన్సిపాల్ మెడ వసంత,గ్రామ పార్టీ అధ్యక్షుడు ముత్యం శ్రీను, పిఈటి రంజిత, భూక్య వీరన్న, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.