వర్షాల నేపథ్యంలో ఆర్అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  • జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటూ క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలి
  • కల్వర్టులు,బ్రిడ్జ్ లు,నిర్మాణంలో ఉన్న రోడ్ల వద్ద రెగ్యులర్ చెకప్ చేయాలి
  • పొంగిపొర్లే వాగుల పై ఉన్న బ్రిడ్జిలను తరచూ పరిశీలించాలి
  • వరద వల్ల కోతకు గురైన రోడ్లను యుద్ద ప్రాతిపదికన వెంటనే పునరుద్ధరించాలి
  • ఎలక్ట్రిసిటీ,రెవెన్యూ,ఇరిగేషన్,పోలీస్,పంచాయతీ రాజ్ విభాగాలతో సమన్వయం చేసుకోవాలి
  • అత్యవసరం అయితే తప్పా సెలవు పై వెళ్లొద్దు..ప్రతి ఆర్ అండ్ బి అధికారి ఫీల్డ్ లో ఉండాలి
  • ప్రజా రవాణాకు ఎక్కడా ఇబ్బంది తలెత్తొద్దు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. సూపరిండెంట్ ఇంజనీర్లు జిల్లా హెడ్ క్వార్టర్ లోనే అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో ఈ.ఈ,డి.ఈ,ఏ.ఈ లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి నాలుగు,ఐదు గంటలకు ఒకసారి ఆయా ఏరియాల్లో పరిస్థితులపై సమీక్ష చేసుకోవాలనీ ఆదేశించారు. హైదరాబాద్ నుండి ఈఎన్సీ,సి.ఈ లు మానిటరింగ్ చేస్తూ తనకు అప్డేట్ ఇవ్వాలన్నారు. కల్వర్టులు,బ్రిడ్జ్ లు,నిర్మాణంలో ఉన్న రోడ్ల వద్ద రెగ్యులర్ చెకప్ చేయాలనీ,పొంగిపొర్లే వాగుల పై ఉన్న బ్రిడ్జిలను తరచూ పరిశీలించాలని సూచించారు.

వరద వల్ల కోతకు గురైన రోడ్లను యుద్ద ప్రాతిపదికన వెంటనే పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రిసిటీ,రెవెన్యూ,ఇరిగేషన్,పోలీస్,పంచాయతీ రాజ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఫీల్డ్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించుకోవాలని అన్నారు. బలమైన ఈదురు గాలితో వచ్చే వానల వల్ల రోడ్లను అనుకోని ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్..రోడ్ల మీదుగా వెళ్లే హైటెన్షన్ వైర్లు వల్ల కూడా ప్రమాదం ఏర్పడే ఆస్కారం ఉన్నదని,ఎక్కడైనా అట్లాంటివి ఉంటే ముందుగానే గుర్తించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. నదులు, వాగుల వెంట,చెరువు కట్ట ల కింద ఉన్న రోడ్లు ఊహించని భారీ వరద ప్రవాహానికి దెబ్బతినే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులతో టచ్ లో ఉంటూ వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. రోడ్ల పై రాకపోకలకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా రోడ్లపై ప్రయాణించే వారిని అప్రమత్తం చేయాలన్నారు. పోలీస్ యంత్రాంగం సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని,అత్యవసరం అయితేనే ప్రజలు రోడ్ల పైకి రావాలని కోరారు. వరదలకు రోడ్డు పాడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తిరిగి వెంటనే రీస్టోర్ చేస్తాం.. ప్రజలు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఆర్ అండ్ బి అధికారి ఫీల్డ్ లో ఖచ్చితంగా ఉండాలనీ అత్యవసరం అయితే తప్పా సెలవుపై వెళ్లొద్దని మంత్రి స్పష్టం చేశారు.