చేనేత సంఘాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన సంఘాల నేతలు… శుక్రవారం హైదరాబాదులోని నివాసంలో రాజ్ గోపాల్ రెడ్డిని కలిసి పలు సమస్యలను విన్నవించారు… వాటిలో ముఖ్యంగా ప్రతి చేనేత మగ్గానికి ఉన్న జియో ట్యాగ్ అనుబంధ కార్మికులను మొత్తం ముగ్గురు ఉండేలా చూడాలని(గతంలో జియో ట్యాగ్ అనుబంధ కార్మికులు ముగ్గురు ఉండేవారు ప్రస్తుతం ఇద్దరికీ కుదించారు)… 350 సంఘాలకు సంబంధించిన 50 కోట్ల రుణాలను మాఫీ చేసి కొత్తగా మళ్లీ రుణాలను మంజూరు చేయాలని, చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.. తన రాజకీయ ప్రస్థానమే చేనేత సంఘాల సమస్యల పరిష్కారంతో మొదలైందని గుర్తు చేస్తూ… తప్పకుండా జియో టాగ్ అనుబంధ కార్మికుల పెంపు, రుణమాఫీ కొత్త రుణాల మంజూరు, చేనేత సంఘాలకు ఎన్నికల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రాజ్ గోపాల్ రెడ్డిని కలిసిన వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సిరిపురం, చౌటుప్పల్, మోత్కూరు, మునుగోడు, పలివెల, పుట్టపాక, సొసైటీ సభ్యులతో పాటు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సొసైటీ సభ్యులు ఉన్నారు.