ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను అప్పగించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటి ముట్టడి

ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించా రు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మే డిపల్లి, నానక్‌నగర్‌, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు వాహనాల్లో దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని ము సారాంబాగ్‌లో ఉన్న ఎమ్మెల్యే రంగారెడ్డి ఇం టికి చేరుకున్నారు. ప్లకార్డులను పట్టుకొని ఎ మ్మెల్యే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఇం ట్లో నుంచి బయటకు రాలేదు. రక్షణగా పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులను, పార్టీ కా ర్యకర్తలను ఇంటికి పిలిపించుకున్నారు. రెండు గంటల తర్వాత మల్‌రెడ్డి రంగారెడ్డి బయటికి రాగా, రైతులు నిరసన తెలిపారు.

ఫార్మాసిటీ ఏర్పాటు చేయనప్పుడు మా భూములను తిరిగి ఇచ్చేయండి’ అని డి మాండ్‌ చేశారు. ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూ ములను రైతులకే తిరిగి ఇప్పిస్తామని ఎమ్మెల్యే రంగారెడ్డితోపాటు రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న తమ భూములను తొలిగిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత చెవిలో పువ్వులు పెట్టారని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే రంగారెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయ త్నం చేశారు. నాలుగు రోజులు గడువు ఇస్తే, సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెనుదిరిగారు.

ఎమ్మెల్యే రంగారెడ్డి, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి మమ్మల్ని మోసం చేస్తున్నరు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వొద్దని అప్పట్లో చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి తిరిగి రైతులకే భూ ములు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా
మా చెవిలో పువ్వులు పెడుతున్నరు. -లక్ష్మి, నానక్‌నగర్‌