మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పద్మావతి కాలనీలో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏనుగొండలోని శాంతివనం ఆనాథ ఆశ్రమంలో చిన్నారులతో కలిసి సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేపిన అనంతరం చిన్నారులకు మంత్రి పండ్లు, స్కూల్‌ బ్యాగులు, తదితర వస్తువులును అందజేశారు.