
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్కు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.