కేసీఆర్‌ బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటిన నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి

బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి, మంత్రి జగదీశ్‌ రెడ్డి తండ్రి చంద్రారెడ్డి, మంత్రి సతీమణి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి మొక్కలు నాటారు. కేసీఆర్‌ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కేసీఆర్‌ బర్త్‌డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్న విషయం విదితమే.