జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినీరంగానికి 7 అవార్డులు రావడం సంతోషం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  • తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది
  • తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులతో తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం
  • సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు అవార్డులు లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపిక కావడం, తెలంగాణలోని పల్లె ఆప్యాయతను కళ్లకు కట్టినట్లు చూపిన బలగం సినిమాలోని పాటలకు కాసర్ల శ్యామ్ కు జాతీయ అవార్డు లభించడం పట్ల మంత్రి వారికి అభినందనలు తెలిపారు.

బేబీ, హను-మ్యాన్ చిత్రాలకు రెండేసి అవార్డులు. గాంధీ తాత చెట్టు చిత్రానికి సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభను చాటిచెప్తున్నది అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సారి సినీ పరిశ్రమను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులతో సత్కరించి,ప్రోత్సాహానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ రంగాన్ని నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

అవార్డులు వరించిన చిత్రాలకు,ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, అవార్డు వచ్చేలా సమష్టి కృషి చేసిన వారి బృందం మొత్తానికి మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.