తెలంగాణ వైద్య విధాన పరిషత్(TVVP)ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం : మంత్రి దామోదర్ రాజనర్సింహా

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహాకి డాక్టర్ల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపినారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు. డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు.

డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీనీ నియమిస్తామన్నారు. TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో మంత్రి దామోదర్ రాజనర్సింహా చర్చించారు. TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డిలోని తన నివాసంలో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశమయ్యారు.

డాక్టర్ల సమస్యలపై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా. నరహరి, సెక్రెటరి జనరల్ డా. లాలు ప్రసాద్, డా. రాహుఫ్, డా. వినయ్ కుమార్, డా. గోపాల్, డా. క్రాంతి, డా. అశోక్, డా. రామ్ సింగ్ లు పాల్గొన్నారు.