వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాలు అమీర్ పేట్ బుద్ధ నగర్, మైత్రి వనం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన. బుద్ధనగర్ లో డ్రైన్ సిస్టంను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందన్నారు. వెంటనే డ్రైనేజీ సిస్టంను స్ట్రీమ్ లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించిన సీఎం. పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చి వేసి పార్కింగ్ కు వినియోగిస్తున్నారని సీఎంకు పిర్యాదు చేసిన స్థానికులు. గంగూబాయి కుంట ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసినారు. ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినారు. ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేసినారు.

వరద పరిస్థితిని సీఎంకు వివరించిన బాలుడు
అమీర్పేట్ బుద్ధ నగర్ లో ఓ బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి. కాలనీలో నడుస్తూ బాలుడు జశ్వంత్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని… ఇంట్లోకి వరదనీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని సీఎంకు చెప్పిన బాలుడు జశ్వంత్. భవిష్యత్ లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి ధైర్యం చెప్పిన్నారు.