ఇవాళ న్యాక్ లో 11 గంటలకు హ్యామ్ రోడ్ల పై కీలక సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రేపు (మంగళవారం) హ్యామ్ విధానంలో చేపట్టనున్న రోడ్లకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది.

ఉదయం 11 గంటలకు NAC లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క,చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు,స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్,ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా,ఆర్ అండ్ బి అధికారులు,బ్యాంకర్లు,కాంట్రాక్టర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

ఆర్ అండ్ బి,పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్ల కు త్వరలోనే టెండర్ ప్రక్రియ మొదలు పెట్టేందుకు రేపటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఆర్ అండ్ బి పరిధిలో ఇప్పటికే 17 ప్యాకేజీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారనీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.