- పూర్తి స్థాయిలో సంస్కరణలు చేపట్టాలి
- ఆధునిక పరిజ్ఞానాన్ని అమలులోకి తేవాలి
- టైం బౌండ్ తో ప్రాజెక్ట్ ల డిజైన్లు
- నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీ
- డిజైన్ విభాగంలో పనిచేసే వారికీ పదోన్నతులు
- ఎలక్ట్రో మెకానికల్ ఇంజినీరింగ్ ప్రాముఖ్యత పెరుగుతుంది
- అందుకనుగుణంగా ఇంజినీరింగ్ నిపుణులను నియమించుకోవాలి
నీటి పారుదల శాఖ సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెడిగడ్డ ఉదంతంలో జాతీయ భద్రత సంస్థ తో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సి.డి.ఓ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వ్యాఖ్యాలపై సి.డి.ఓ పునఃసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ. ఎన్.సో అంజద్ హుస్సేన్,రమేష్ బాబు లతో పాటు నీటిపారుదల శాఖా జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్ సి.డి.ఓ సి.ఇ యం.సత్యనారాయణ రెడ్డి,సి.ఇ లు అజయ్ కుమార్,మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సి.డి.ఓ ను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముక్యంగా ప్రాజెక్టుల డిజైన్ ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకరావాలన్నారు. అందుకు అవసరమైన లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ముందుండాలన్నారు. ఒకప్పుడు సి.డి.ఓ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.వందేళ్ల క్రితం నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి మొదలు పెడితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్మించిన ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణాలలో వినియోగించిన సాంకేతికత తెలంగాణా సి.డి.ఓ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు.అటువంటి ప్రతిభ చాటుకునేందుకు సి.డి.ఓ సంస్థ కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు. అటువంటి సంస్థ విశ్వసనీయత గలిగిన సంస్థకు ఎట్టి పరిస్థితిలలోనూ నష్టం వాటిల్లబోనియమని లోపాలు సరిదిద్ది అదే ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అదే సమయంలో సి.డి.ఓ లో ఖాళీగా ఉన్న ఉద్యగాల భర్తీకి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నీ స్థాయిలలో ఉద్యగాల భర్తీ చేపట్టడం సంస్థను బలోపేతం చేయడంలో బాగామేనన్నారు. ఐ. ఐ. టి లు,ఎన్.ఐ టి ల వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి నీటిపారుదల శాఖలో నియమితులైన ఇంజినీర్లను సి.డి.ఓ లో పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవి కావడంతో ప్రతిభావంతులైన ఇంజినీర్ల సేవలు వినియోగించు కోవాలని ఆయన సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్దిష్టమైన ఇంజినీరింగ్, సృజనాత్మక అవసరమని అది అత్యుత్తమ శిక్షణ పొందిన నిపుణుల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. అటువంటి నిష్ణాతులైన ఇంజినీర్లను వినియోగిస్తూ అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలన్నారు.పదవీ విరమణ పొందిన అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వారి సేవలు కుడా వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు రాబట్టలన్నారు. అంతే గాకుండా నీటిపారుదల శాఖా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలక్ట్రోమెకానికల్ ఇంజినీరింగ్ ప్రాముఖ్యత మునుముందు మరింత పెరగబోతుందన్నారు. అటువంటి సమయంలో లోతైన పరిజ్ఞానం కలిగి ఉన్న నిపుణులను నియమించడం ద్వారా సి.డి.ఓ తిరిగి పూర్వవైభవం చాటుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఐ. ఐ. టి హైదరాబాద్, జే. ఎన్.టి.యూ,టి.ఎస్ జెన్ కో వంటి సంస్థలకు చెందిన వారిని నియమించే ముందు టైంబౌండ్ పద్దతిలో డిజైన్ ల రూపకల్పన లో ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు సమయపాలనకు పెద్ద పీట వేయాలన్నారు.
నెల్లికల్లు, డిండి ఎత్తిపోతల పధకాల పై..
నల్లగొండ జిల్లాలో నెల్లికల్లు, డిండి ఎత్తిపోతల పధకాల డిజైన్ లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆలస్యం అయే కొద్దీ రైతులకు నీరు అందించడంలో జరుగుతున్న జాప్యం దృష్టిలో పెట్టుకుని డిజైన్ లకు తక్షణం ఆమోదించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
