జనహిత పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 24న పునః ప్రారంభం కానుంది. ఈ నెల 24న చొప్పదండి నియోజకవర్గంలో యాత్ర మొదలవుతుంది. 25న వర్ధన్నపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నెల 26న సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంతో పర్యటన ముగుస్తుంది.
ఆ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు(డీసీసీ), ఉమ్మడి జిల్లాల వారీ ఇన్‌చార్జ్‌లతో బుధవారం మీనాక్షీ నటరాజన్, మహేశ్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలు, పార్టీ నిర్మాణం, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం.