- నేను ఎంత అవినీతి చేసిన నన్ను కాపాడుతారు.. మంచి పోస్టింగ్ ఇస్తారని RO అధికారి చెప్పుకుంటన్న మాటలే నిజాలు అవుతున్నాయా..?
- ఈ అవినీతి అధికారిని కాపాడుతున్నది ఎవరు..?
- ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కొత్తగూడెం పిసిబి RO అధికారి..!
- గతంలో RO అధికారులపై ఫిర్యాదులు వచ్చాయని రాత్రికి రాత్రే రిపోర్ట్ లు రాసి చర్యలు తీసుకున్నారు.. ఇప్పుడు చర్యలు ఎందుకు లేవని ప్రశ్నిస్తున్న పలువురు PCB అధికారులు..
- ఇప్పుడు పూర్తి ఆధారాలు (ఆడియో రికార్డ్)తో సహా ఫిర్యాదు చేసిన కూడా చర్యలు తీసుకోవడంలో PCB ఉన్నతాధికారుల అలసత్వం ఎందుకు..?
- రిటైర్డ్ కాబోతున్న అధికారిని ఎంక్వైరీ అధికారిగా వేయడం వెనుకున్న మతలబు ఏంటి..?
- ఆ రిటైర్డ్ అధికారి తనకు ఇష్టం వచ్చినట్లు ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తే అదే ఫైనల్ అవుతుందా..?
- పరిశ్రమ వారిని బెదిరించి లేఖలు తీసుకోవడం వెనకున్న అధికారి ఎవరు..?
- పరిశ్రమ వారు ఫిర్యాదుదారునికి చెప్పినది అంతా అబద్దమా..?
- పరిశ్రమ వారు ఫిర్యాదుదారున్నీ ZO HYD కార్యాలయంలో కలవలేదా..? CC TV ఫుటేజ్ కూడా అబద్దం చెప్తుందా..?
- కాల్ రికార్డ్ విన్న విచారణ అధికారి జరిగింది నిజమే అని ఫిర్యాదుదారునికి చెప్పి.. ఎలాగూ రిటైర్డ్ అవుతున్నా కదా అని చివరికి చేసింది ఏంటి..?
- పర్యావరణ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు ఫిర్యాదు చేసిన శిక్ష ఉండదా..?
- విజిలెన్స్ విచారణకు వెళ్ళిన ఫైల్ వెనక్కి రప్పిస్తున్నారా..?
- విజిలెన్స్, ఏసీబీ విచారణలనే ఆపగలిగితే.. ఇంకా అవినీతి అధికారులకు భయం ఉంటదా..?
- ఆ అవినీతి అధికారి నిజంగా నిజాయితీపరుడే అయితే విజిలెన్స్ విచారణకు భయం ఎందుకు..?
- ఆదాయానికి మించి ఆస్తులే కూడబెట్టకపోతే వణుకెందుకు..?
- ఫిర్యాదుదారులపైనే నిందలు వేస్తే అవినీతిపరులు.. నిజాయితీపరులు అవుతారా..?
- అసలు వీరు ఎంత అవినీతి చేసిన ఫిర్యాదులే చేయొద్దా..?
- తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడే నాథుడే లేడా..?
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం కొత్తగూడెం పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా EE గా పనిచేస్తున్న అధికారి అవినీతి, అక్రమాలలో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఈయన గారు అవినీతి సొమ్ముకు అలవాటు పడి పొల్యూషన్ చేస్తున్న పరిశమ్రల యాజమాన్యాలతో కుమ్మక్కై పర్యావరణాన్ని గాలికి వదిలేసి పొల్యూషన్ ను క్రియేషన్ చేస్తున్నారని పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు నెత్తినోరు కొట్టుకొని చెప్పిన పట్టించుకునే నాథుడే లేకుండా పోయిండు. పొల్యూషన్ చట్టాలను, నియమ నిబంధనలను తుంగలో తొక్కి పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై, ఒప్పందం చేసుకుని నెల వారి వసూళ్ళకు పాల్పడుతూ పర్యావరణ పరిరక్షణ అనే స్పృహే లేకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురి నోట వినిపిస్తున్న మాట. అంతేకాదు తన కింద ఉన్న అధికారులతో కూడా అడ్డగోలు మాటలతో ఎప్పుడు గొడవలు పడతాడని తన కింద పనిచేయాలంటేనే కిందిస్థాయి అధికారులు భయపడతారని పలువురు PCB అధికారులే చెబుతుండటం విశేషం.
కొద్దిరోజుల క్రితం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని ఓ రైస్ ఇండస్ట్రీకి సంబంధించిన CFO విషయంలో రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి ఆ పరిశ్రమ వారిని అనేక ఇబ్బందులకు గురిచేసిండు. ఇంత లంచం మేము ఇవ్వలేమూ సర్ అని సదరు పరిశ్రమ వారు ప్రాధేయపడి.. బతిమిలాడగా చివరికి రూ.5 లక్షల లంచం ఇస్తేనే పని అవుతది లేదంటే పరిశ్రమను క్లోజ్ చేస్తాను అని బెదిరించడంతో… ఆ పరిశ్రమ వారికి దిక్కుతోచక PCB జోనల్ కార్యాలయం, హైదరాబాద్ లోని పై అధికారులను సంప్రదించి ఎలాగొలా CFO ను తెచ్చుకోవడం జరిగిందని చెప్పారు. నేను లంచం అడిగితే ఇవ్వకుండా నన్ను కాదని ZO కి వెళ్ళి CFO తెచ్చుకుంటారా.. అని అది మనసులో పెట్టుకొని సదరు పరిశ్రమపై EE గారు మధ్యవర్తులతో (తన ఏజెంట్ల ద్వారా) ఖమ్మం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేపించడం జరిగింది. ఆట్టి ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్థానిక తహశీల్దార్ ని విచారించమని ఆదేశించగా.. స్థానిక తహశీల్దార్ విచారించి పరిశ్రమ దగ్గరగా పొలాలు ఉన్న రైతులు పరిశ్రమకు అనుకూలంగా చెప్పడంతో ఇది సరైన పద్దతి కాదని పరిశ్రమ వారి తప్పు ఏం కనిపించడం లేదని ఫిర్యాదుదారులను తహశీల్దార్ మందలించి పంపించడం జరిగింది. అయినా సరే PCB EE వదలకుండా మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదుదారులతో తహశీల్దార్ మాకు సపోర్ట్ చేయడంలేదని పరిశ్రమవారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుండని తమకు న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేపించిండని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ PCB, కొత్తగూడెం ప్రాంతీయ కార్యాలయానికి రాయగా తాను అనుకున్నది అదే కాబట్టి.. EE కోరిన అవకాశం దొరకడంతో సదరు పరిశ్రమను ఇన్స్పెక్షన్ చేయడానికి అని వెళ్ళి నానా హడావిడి చేస్తూ.. పరిశ్రమ వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ.. అడిషనల్ కలెక్టర్ నుండి ఆదేశాలు వచ్చినాయి. నువ్వు ఇప్పుడు PCB మొత్తంలో ఎవ్వరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ.. పరిశ్రమకి క్లోజర్ ఆర్డర్ ఇస్తానని భయపెడుతూ.. చివరికి EE అడిగిన రూ.5 లక్షలు లంచం డబ్బును తీసుకొని EE ఈగోను సంతృప్తి పరుచుకోవడం జరిగిందని సదరు పరిశ్రమ వారు వాపోయారు. పరిశ్రమలో ప్రభుత్వానికి సంబంధించిన సిఎంఆర్ బియ్యం ఉండటంతో సదరు పరిశ్రమ వారు భయపడిపోయి.. పరిశ్రమ క్లోజ్ అయితే ప్రభుత్వానికి సంబంధించిన సిఎంఆర్ బియ్యం ఇన్ టైంలో ఇవ్వలేము మరియు కోట్ల రూపాయాల నష్టం వస్తుందని భయపడి EE అడిగిన లంచం ఇవ్వక తప్పలేదు అని పరిశ్రమ వారు చెప్పారు. కొత్తగూడెం EE ప్యాడీ సీజన్ చూసి మమ్మల్ని గన్ పాయింట్ లో పెట్టి భారీగా లంచం తీసుకున్నారని బాధపడ్డారు. ఇట్టి విషయంలో అందరికీ కలిపి రూ. 9 లక్షలు రూపాయాలు భారీ లంచంగా ముట్టచెప్పాల్సి వచ్చిందని.. ఇంత పెద్దఎత్తున లంచం సొమ్ము ఇచ్చిన కూడా ఇంకా సమస్య తీరలేదని.. PCB, కొత్తగూడెం EE లాంటి అధికారులు ఉంటే తాము పరిశ్రమలను నడపడం కష్టం అని ఓ పర్యావరణవేత్తకు చెప్పుకొచ్చారు.
పరిశ్రమ వారు చెప్పిన దానిపై సదరు పర్యావరణవేత్త PCB మెంబర్ సెక్రటరీని కలిసి రాతపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడి నుండి అసలు బాగోతం నడిచింది. PCBలోని అవినీతి అధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చిన చర్యలు ఎందుకు ఉండవో ఈ సంఘటన ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. కొత్తగూడెం EE పై వచ్చిన అవినీతి ఫిర్యాదుపై PCB మెంబర్ సెక్రటరీ రిటైర్డ్ కాబోతున్న JCEE ని ఎంక్వైరీ అధికారిగా నియమించి పూర్తి విచారణ రిపోర్ట్ తెప్పించాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడి నుండి PCBలో ఓ డ్రామాకు తెర తీసింది. ఫిర్యాదుదారుడు PCB మెంబర్ సెక్రటరీకి తేది:26.05.2025 రోజు ఫిర్యాదు చేస్తే తేది:10.06.2025 రోజు ZO, HYD కార్యాలయంలో రిటైర్డ్ కాబోతున్న JCEE అధికారికి చేరిందని చెప్పడం జరిగింది. సనత్ నగర్ కార్యాలయం నుండి బేగం పేట కార్యాలయం దూరం సుమారు 3 కిలోమీటర్లు ఈ మాత్రం దూరానికి ఓ ఫైల్ చేరడానికి 15 రోజుల సమయం పట్టింది. ఫైల్ ఎక్కడ ఉందా అని ఎంక్వైరీ చేస్తే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ దగ్గర ఉన్నదని తెలిసి.. 15 రోజులు ఆగిన ఫైల్ కదలడానికి ఫిర్యాదుదారుడు 4 లేదా 5 సార్లు PCB ప్రధాన కార్యాలయానికి తిరిగి అధికారుల వెంటపడితే అప్పుడు కానీ ఫైల్ ముందుకు కదలలేదు. ఈ లోపు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే EE కొత్తగూడెం అధికారికి మాత్రం (ఆన్ ఫిషియల్)గా చేరింది.
ఇక్కడి నుండి ZO, HYD కార్యాలయంలో రిటైర్డ్ కాబోతున్న JCEE అధికారి అసలు కథ నడిపిండు. తేది:13.06.2025 రోజు ZO, HYD కార్యాలయంలో రిటైర్డ్ కాబోతున్న JCEE అధికారిని ఫిర్యాదుదారుడు కలిసి విచారణ గురించి అడుగగా విచారణ ప్రారంభమైందని చెప్పడం జరిగింది. రిటైర్డ్ కాబోతున్న నన్ను విచారణ అధికారిగా నియమించి ఇబ్బందికి గురిచేస్తున్నారు అని చెప్పడం జరిగింది. నా దగ్గర ఉన్న ఆడియో రికార్డ్ మరియు ఇతర ఆధారాలను తీసుకోమని అడుగగా ఇప్పుడు వద్దు ఓ రోజు మిమ్మల్ని కూడా పిలిచి మీ దగ్గర ఉన్న అన్నీ ఆధారాలను తీసుకుంటాను అని చెప్పి ఫిర్యాదుదారుడిని పంపించడం జరిగింది. రోజులు గడుస్తున్నా ఫిర్యాదుదారుడిని మాత్రం విచారణకు పిలవకపోవడంతో తేది:19.06.2025 రోజున ఫిర్యాదుదారుడు మరోసారి విచారణ అధికారిని ఫోన్ కాల్ లో విచారణ గురించి అడుగగా పరిశ్రమకు చెందిన వారిని సంప్రదించాము అతనికి హెల్త్ బాగోలేదు. 2 లేదా 3 రోజుల తరువాత వస్తానని సమయం ఆడిగిండు అని చెప్పడంతో పాటు విచారణలో భాగంగా ముందు పరిశ్రమ వారిని తరువాత EE కొత్తగూడెం ఆ తరువాత ఫిర్యాదుదారుడిని పిలిచి విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. విచారణకు ఇంకా ఎంత సమయం పడుతుందని ఫిర్యాదుదారుడు అడుగగా విచారణ చేస్తున్నాం రిటైర్డ్ కాబోతున్న సమయంలో ఈ విచారణ చేయడమే నాకు ఇబ్బందిగా ఉంది. నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. రోజులు గడుస్తున్నాయే తప్ప ఫిర్యాదుదారుడిని ఎంతకూ విచారణకు పిలకపోవడంతో ఆ అధికారి రిటైర్డ్ కాబోతున్న సమయం దగ్గర పడుతుండటంతో తేది:24.06.2025 రోజు కలిసి అడుగగా పరిశ్రమ ప్రతినిధి ముందురోజే వచ్చి కలిసి వెళ్ళిండు. తన తండ్రిని తీసుకొని మరోసారి వస్తాను అని చెప్పిండు అని తెలిపాడు. అప్పుడు కూడా ఫిర్యాదుదారుడు తన దగ్గర ఉన్న ఆడియో రికార్డ్ తీసుకోవాలని మరోమారు అడుగగా పరిశ్రమ వారు వచ్చే రోజు మిమ్మల్ని కూడా విచారణకు పిలుస్తాము. పరిశ్రమ వారిని మిమ్మల్ని ఒకేసారి విచారణ చేస్తాము అని చెప్పి పంపించడం జరిగింది. ఆ తరువాత కూడా పిలుపు రాకపోవడంతో ఫిర్యాదుదారుడు ఈ మధ్యలో మరోసారి మెంబర్ సెక్రెటరీని కలిసి విచారణ అనుకున్న విధంగా జరగడం లేదు మరో అధికారిని వేయండి అని కోరడం కూడా జరిగింది. రిటైర్డ్ కాబోతున్న అధికారినైన నన్ను ఎన్ క్వైరీ అధికారిగా వేయడం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని చెప్తున్నాడు.. అని కూడా చెప్పడం జరిగింది. ఆ తరువాత తేది:28.06.2025 రోజున కూడా మరోసారి ఫిర్యాదుదారుడు విచారణ అధికారిని కలిసి విచారణ గురించి అడుగగా పరిశ్రమ వారు రావడం లేదు నేను విచారణను కొనసాగించలేకపోతున్నాను ఇప్పటి వరకు జరిగిన విచారణను మెంబర్ సెక్రెటరీకి సమర్పిస్తాను తదుపరి విచారణను మరో అధికారి పూర్తి చేస్తాడు అని ఫిర్యాదుదారుడితో చెప్పడం జరిగింది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ విచారణ అధికారి ఆడిన అబద్దం ఫిర్యాదుదారుడికి ముందే తెలిసింది. కానీ విచారణ అధికారి మాత్రం మేం ఏం చేసిన ఫిర్యాదుదాదారుడికి తెలిసే అవకాశం లేదనుకుని విచారణ అధికారి, మరో అధికారి మరియు EE కొత్తగూడెం ముగ్గురు కలిసి పరిశ్రమ వారిని ఓ ప్రముఖ హోటల్ కి పిలిపించుకొని బెదిరించి అక్కడే ఓ రెండు లెటర్లను తమకు అనుకూలంగా రాపించుకున్న విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా ముందే ఫిర్యాదుదారుడికి తెలిసింది. అది తెలిసిన వెంటనే ఫిర్యాదుదారుడు విచారణ అధికారిని కలిసి తన దగ్గర ఉన్న ఆడియో రికార్డ్ తీసుకోమని మరోసారి కోరగా తదుపరి వచ్చే విచారణ అధికారికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది, నేను తేది: 30.06.2025 రోజున రిటైర్డ్ అవుతున్నాను, నన్ను ఏం అడగొద్దు అని కూడా చెప్పడం జరిగింది. కనీసం ఇప్పటిదాకా జరిగిన విచారణకు సంబందించిన డాక్యుమెంట్స్ అయిన ఇవ్వండి అని ఫిర్యాదుదారుడు అడుగగా నేను ఇవ్వలేను. మీరు తేది: 30.06.2025 (రిటైర్డ్ అయిన) తరువాత PCB ప్రధాన కార్యాలయంలో అడిగి తీసుకోండి అని చెప్పడంతో ఫిర్యాదుదారుడు చేసేది ఏం లేక వెనుదిరగడం జరిగింది.
ఆ తరువాత తేది:02.07.2025, తేది:05.07.2025 మరియు తేది:08.07.2025 వరుసగా ఫిర్యాదుదారుడు PCB ప్రధాన కార్యాలయంకు వెళ్ళి విచారణ అధికారి రిటైర్డ్ అయివెళ్లిపోయిండు. విచారణకు సంబందించిన ఫైల్ వివరాలు ఇవ్వండి అని అడగడంతో ప్రధాన కార్యాలయం వారు తేది:11.07.2025 రోజున ఇవ్వడం జరిగింది. విచారణకు సంబందించిన ఫైల్ లో పరిశ్రమ వారు EE కి అనుకూలంగా ఇచ్చిన లేఖలు మరియు విచారణ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఫిర్యాదుదారుడు చూడగా అందులో బోర్డు యాక్షన్ డ్రాప్డ్ అనడంతో పాటు ఇది ఫాల్స్ ఎలిగేషన్, ఇందులో వేరే మోటివ్ ఉంది అని రాయడంలో అర్ధం ఏంటి..? EE, కొత్తగూడెం నిజాయితీపరుడు అని సర్టిఫికేట్ ఇస్తున్నారా..? ఓకే, కాసేపు అదే నిజం అనుకుందాం.. మరి ఫిర్యాదుదారుడికి పరిశ్రమ వారు ZO, HYD కార్యాలయంలో కలిసి చెప్పింది అబద్దమా…? అలా అయితే ZO, HYD కార్యాలయంలో ఉన్న CC TV ఫుటేజ్ లు కూడా అబద్దలు అవుతాయా..? అంతేకాక కాల్ చేసి మరీ ఎక్కడో కొత్తగూడెంలో RO పరిధిలో జరిగింది మొత్తం పూసగుచ్చిన్నట్లు చెప్పిన ఆడియో కాల్ రికార్డ్ అబద్దమా..? ఏది నిజం.. ఏది అబద్దం..? ఎవరు నిజం.. ఎవరు అబద్ధం..? తేల్చేద్దాం రండి..
ఆ పరిశ్రమపై EE, కొత్తగూడెం మధ్యవర్తులతో (తన ఏజెంట్ల ద్వారా) చేసిన దాష్టీకం గురించి అట్టి పరిశ్రమ వారు చెప్పకపోతే హైదరాబాద్ లో ఉన్న ఓ పర్యావరణవేత్తకు ఎలా తెలిసింది. తప్పుడు ఫిర్యాదే అయితే పర్యావరణ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ ఏసీబీ డీజీ, విజిలెన్స్ కమిషనర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేసే ధైర్యం చేస్తాడా..? అసలు తన దగ్గర ఉన్న (ఆడియో రికార్డ్) ఆధారాలు తీసుకొని పరిశీలిస్తే నిజా నిజాలు తెలుస్తాయి కదా..? అది చేయడం వదిలేసి.. పాపం కొంతమంది PCB అధికారులు PCBలోనే ఫిర్యాదును తొక్కివేస్తే అయిపోతుంది అనుకున్నారు. కానీ వారే ఊహించని విధంగా ఫిర్యాదుదారుడు పర్యావరణ మంత్రి కొండా సురేఖ, చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు ఫిర్యాదు చేసి.. ఈ అవినీతి అధికారిపై పూర్తి విచారణ చేయాలని కోరగా అక్కడ కూడా ఫైల్ ఆపాలని ప్రయత్నం చేయగా.. ఫిర్యాదుదారుడు పట్టువదలకుండా వెంటపడటంతో పర్యావరణ మంత్రి విచారణ కోసం విజిలెన్స్ కు పంపమని సంబంధిత అధికారులను ఆదేశించడమే కాకుండా ఫైల్ విజిలెన్స్ విచారణకు కూడా వెళ్లింది అని తెలియగానే.. కొంతమంది PCB అధికారులకు ఇది మింగుడు పడక.. వెంటనే ఆగమేఘాల మీద సచివాలయం వెళ్ళి మంత్రి గారిని కలిసి విజిలెన్స్ విచారణను ఆపండి అని కొరడమే కాకుండా.. ఫిర్యాదుదారుడి పైనే పలు నిందలు వేయాలని చూశారని విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదుదారుడి ఫిర్యాదే అబద్దం ఐతే విజిలెన్స్ విచారణలో నిజ నిజాలు తెలుస్తాయి కదా..? విజిలెన్స్, ఏసీబీ విచారణనే అపగలిగితే.. ఇంకా అవినీతి అధికారులకు భయం ఉంటదా..? ఆ అవినీతి అధికారి నిజంగా నిజాయితీ పరుడే అయితే విజిలెన్స్ విచారణకు భయం ఎందుకు..? ఆదాయానికి మించి ఆస్తులే కూడబెట్టకపోతే వణుకెందుకు..? ఫిర్యాదుదారులపైన నిందలు వేస్తే అవినీతిపరులు.. నిజాయితీపరులు అవుతారా..? అసలు వీరు ఎంత అవినీతి చేసిన ఫిర్యాదులే చేయొద్దా..? తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడే నాథుడే లేడా..?
PCBలో ఎవరు విచ్చలవిడి అవినీతికి పాల్పడినా ఫిర్యాదులే చేయొద్దా..? ఫిర్యాదు చేస్తే కొంతమంది PCB అధికారులు తమ దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో ఎంత మందినైనా మేనేజ్ చేస్తాం.. ఎవరినైనా కొనేస్తం అని బెదిరిస్తారా..? దొంగ.. దొంగ.. అని అరిస్తే భుజాలు తడుముకుంటున్న అవినీతి PCB అధికారులు ఎవరు..? నిజా నిజాలను త్వరలో మరో ఆర్టికల్ లో తేల్చుకుందాం.. వరుస కథనాలను మీ ముందుకు తీసుకువస్తుంది.. మీ నిఘా నేత్రం న్యూస్.. ✍️✍️
