రూ.600 కోట్ల ‘గుడ్ల సరఫరా కుంభకోణం’ ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్రంలోని సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం గుడ్ల కొనుగోలు వ్యవహారంలో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందని వస్తున్న ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిరాధారమని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కొట్టిపారేశారు . “ఈ ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధం, రాజకీయ ప్రేరేపితమైనవి, ప్రభుత్వ ఉత్తర్వుల ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవే” అని స్పష్టం చేశారు. జూలై 8, 2025న జారీ చేసిన జి.ఓ.ఎం.సి. 17 కింద పెద్ద కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధానం తీసుకొచ్చారని వచ్చిన వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. జి.ఓ.ఎం.సి. 16 మరియు జి.ఓ.ఎం.సి. 17 మధ్య ఉన్న తేడాను ఉద్దేశపూర్వకంగా కలగలిపి ప్రచారం చేస్తున్నారని మంత్రి ఖండించారు.

జి.ఓ.ఎం.సి. 17 – నేపథ్యం:
ఈ ఉత్తర్వు మేరకు రాష్ట్రం ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (PMU)‌ను ఏర్పాటుచేసింది. దీని ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం ఏకరీతి, పారదర్శకమైన టెండర్ విధానం ద్వారా ఆహార పదార్థాల సరఫరా చేయించడం. సుమారు 6.49 లక్షల మంది విద్యార్థులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన, సకాలంలో, నాణ్యమైన బలవర్ధకమైన భోజనం అందించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన లక్ష్యాలు
జిల్లావ్యాప్తంగా ఏకరీతి రేటు విధానం అమలు. పోషకాహారం, పరిశుభ్రమైన భోజనం, ఫుడ్ పాయిజన్ ఘటనలు నివారణ. మండల మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకు అవకాశాలు కల్పించడం. జిల్లాలోని బహుళ విద్యాసంస్థలకు ఒకే ఏజెన్సీ టెండర్ వేసే సౌకర్యం కల్పించడం.
గుడ్ల సరఫరా ఆరోపణలపై స్పష్టత
జి.ఓ. 17లో పెద్ద కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చే నిబంధన ఏదీ లేదని తెలిపారు . గుడ్లు తప్పనిసరిగా AGMARK ప్రమాణాలు కలిగిన మధ్య తరహా (45–52 గ్రా.) సైజులో ఉండాలని షరతు. ఇది NIN ప్రమాణాల ప్రకారం పెద్ద గుడ్ల (50–60 గ్రా.) పరిధిలోనూ సరిపోతుందన్నారు.
గత విధానంలోని లోపాలు
పరిశీలనలో పాత విధానంలో ఈ లోపాలు బయటపడ్డాయనీ తెలిపారు. కొంతమంది స్థానిక కాంట్రాక్టర్ల ద్వారా నాణ్యతలేని, తక్కువ పరిమాణంలో సరఫరా.

కాంట్రాక్టర్లు–ప్రిన్సిపల్స్ కుమ్మక్కు
పరిశుభ్రత లేని వంటశాలలు, సిబ్బంది కొరత. వీటిని అధిగమించేందుకు కొత్త మార్గదర్శకాల ద్వారా పరిష్కారం చూపాలని నిర్ణయించామన్నారు. జిల్లా/మండల స్థాయిలో ఏకరీతి రేటు ద్వారా కూరగాయలు, మాంసం, గుడ్లు తదితర సరఫరా.సమీప మండలాలను ఒకే సరఫరాదారునికి కేటాయించడం ద్వారా ఆలస్యం లేదా డిలే కాకుండా ఉండేలా తగిన చర్యలు. అర్హత కలిగిన వారందరికీ టెండర్‌లో సమాన అవకాశాలు ఉంటాయి.

    ప్రభుత్వ ఉద్దేశం
    “ఇది ఉద్యోగ కల్పన పథకం కాదు. పిల్లల ఆరోగ్య రక్షణే లక్ష్యం. అర్హత ఉన్న ఎవరైనా టెండర్‌లో పాల్గొనవచ్చు. ఈ విధానం పారదర్శకంగా ఉంటుంది” అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. పరిశుభ్రత, పోషకాహార ప్రమాణాల అమలు కోసం ప్రత్యేక తనిఖీ కమిటీని ప్రభుత్వం నియమించింది. రూ. 600 కోట్ల గుడ్ల కుంభకోణం” ఆరోపణలు నిరాధారమని, తప్పుదోవ పట్టించేవని ధ్వజమెత్తారు.. సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతి చిన్నారికి సురక్షిత, పోషకాహారం అందించడమే జి.ఓ. 17 లక్ష్యమని స్పష్టం మంత్రి స్పష్టం చేశారు.