రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం లేదు: మంత్రి తుమ్మల

  • రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కేటాయింపుల ప్రకారం కేంద్రం సరఫరా చేయలేదు
  • యూరియా కొరత మన రాష్ట్రంలోనే కాదు.. మన పక్క రాష్ట్రాల్లోను ఉంది
  • పూర్తి వివరాలు మీకు లేఖ ద్వారా అందచేస్తున్నాను
  • రామచంద్రరావు గారు కేంద్రం ఇచ్చినట్టు మీ దగ్గర వివరాలు ఉంటే చెప్పండి
  • మీది రైతు మిత్ర ప్రభుత్వం కాదు, రైతు శత్రు ప్రభుత్వం

స్వయంగా కేంద్రమంత్రి నడ్డాని రెండు సార్లు కలిసాను దేశంలో ఏ రాష్ట్రంలోను యూరియా కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందని రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత యూరియా కేటాయించింది, ఎంత సరఫరా చేసింది అనే వాస్తవాలను ముందుగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. కేవలం తెలంగాణలోనే కాదు, పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా యూరియా కొరత ఉందని తెలిపారు. BJP రైతు మిత్ర ప్రభుత్వం కాదని, రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. కేంద్రం రాష్ట్ర అవసరాలకు మించి యూరియా ఇచ్చిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయలేకపోయిందని విమర్శించడం శోచనీయమని, అర్ధరహితమని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆరోపణలు తెలంగాణ బీజేపీ పార్టీకి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని శంకింప చేస్తున్నాయని అన్నారు. ముందుగా అన్ని వివరాలు తెలుసుకొని సీబీఐ ఎంక్వైరీల వంటి ప్రగల్భాలు పలకాలని ఆయన హితవు పలికారు. మళ్లీ మీ అవగాహనా కోసం, భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడేముందు తెలుసుకొని మాట్లాడుతారని ఆశిస్తున్నాను మరోసారి పూర్తి వివరాల మరోసారి ఇస్తున్నాను.

ఎప్రిల్ నెలవరకు ఉన్న రాష్ట్రంలో ఉన్న నిల్వలు – 1.92 LMTs
ఎప్రిల్ నెలలో కేటాయించింది 1.70 LMTs, సరఫరా చేసింది 1.21 LMTs
మే నెలలో కేటాయించింది 1.60 LMTs, సరఫరా చేసింది 0.88 LMTs
జూన్ నెలలో కేటాయించింది 1.70 LMTs, సరఫరా చేసింది 0.98 LMTs
జులై నెలలో కేటాయించింది 1.60 LMTs, సరఫరా చేసింది 1.43 LMTs
ఆగస్టు నెలలో కేటాయించింది 1.70 LMTs, సరఫరా చేసింది 0.62 LMTs
ఎప్రిల్ నుండి ఆగస్టు నెల వరకు కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది 8.30 LMTs అయితే సరఫరా చేసింది కేవలం 5.12 LMTs మాత్రమే. అంటే ఆగస్టు నెల వరకు మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా కంటే 3.20 LMTs యూరియా తక్కువగా సరఫరా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు ఉన్న నిల్వలు కలుపుంటే మొత్తం 7.04 LMTs యూరియా రైతులకు అందుబాటులో ఉంచి, జిల్లాల వారిగా కేటాయింపులు చేశాము. ఇందులో ఇప్పటివరకు రైతులు 6.52 LMTs యూరియాను కొనుగోలు చేయగా, ప్రస్తుతం 0.76 LMTs యూరియా అందుబాటులో ఉంది. ఇవి యూరియాకు సంబంధించిన అసలైన వివరాలు. మీ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే ఇవ్వండి. అంతేకాని నరం లేని నాలుకతో ఏదో నోటికొచ్చింది మాట్లడకండి అని మంత్రి తుమ్మల దుయ్యబట్టారు.

కేంద్రం ఇచ్చిన యూరియాను జిల్లాల వారిగా కేటాయించుకుంటూ, అప్పటికే రాష్ట్రం వద్ద నిల్వ ఉన్న యూరియాను వాడుకుంటూ ఇప్పటివరకు సర్దుబాటు చేయడం జరిగింది. ఇదేదో మా ప్రభుత్వం కావాలని కృత్రిమ కొరత సృష్టించడం కాదు. కేంద్రం కొన్ని రాష్ట్రాల పట్ల సవతి ప్రేమను చూపిస్తూ, కావాలని కేంద్రం సృష్టిస్తున్న కొరత అని అన్నారు. CBI కాకుంటే ABI పెట్టుకున్న బాధలేదు కానీ, కేంద్ర మంత్రిత్వ శాఖా స్వయంగా నిర్వహిస్తున్న MFMS పోర్టల్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని ఎరువులు ఎన్ని వచ్చాయో డీలర్ తో సహా, కంపెనీతో సహా వివరాలు ఉంటాయన్న విషయం కూడా తెలియకుండా సిబిఐ తో ఎంక్వయిరీ అని మాట్లాడటం వారికి ఉన్న అజ్ఞానం బయట పెట్టుకోవడమే. ఇప్పటికే లెక్కలతో సహా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, సహాయ మంత్రి బండి సంజయ్ కి తెలిపనా, అదేవిధంగా మా అధికారులు కేంద్ర అధికారులను కలిసినా, నేను, రాష్ట్ర ముఖ్యమంత్రి పలుమార్లు కేంద్ర ఎరువుల మరియు రసాయన మంత్రి జెపి.నడ్డా కి అభ్యర్థించినా, కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కర్కశ మనస్థత్వంతో ప్రవర్తిస్తుందని అన్నారు. ఇప్పటికైనా సీబీఐ ఎంక్వైరీలు లాంటి ప్రగల్భాలు పలకడం మానుకొని, రాష్ట్ర రైతుల ప్రయోజనార్థం రాష్ట్రానికి రావాల్సిన యూరియాను త్వరగా తెప్పించాలని కోరుతున్నానని అన్నారు.