టేకుమట్ల మూసి రహదారికి కేసీఆర్‌ రహదారిగా నామకరణం

జిల్లాలోని టేకుమట్ల మూసి రహదారికి కేసీఆర్‌ రహదారిగా నామకరణం చేశారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీష్‌రెడ్డి పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టారు. టేకుమట్ల నుంచి సోలిపేట మూసి ప్రాజెక్ట్‌ వరకు 12 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా 6,600 మొక్కలను నాటారు. మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని 66 మందితో రక్తదానం నిర్వహించారు. నెల్లికల్లు గ్రామ శివారులో ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువల మీద రైతాంగం సీఎం పుట్టినరోజు వేడుకలను నిర్వహించింది.