- సామాజిక న్యాయానికి, ధర్మానికి పాపన్న విగ్రహం పునాది
- సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని కుల గణన రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా చేపట్టి బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య దేశంలోనే చర్చకు దారితీసింది, కేంద్రం అనివార్యంగా కులగనన చేపట్టాల్సిన పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు.
అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని ప్రతి బహుజనుడు ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.
బహుజన బిడ్డలు భవిష్యత్తులో ఫలాలు పొందేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడాలని డిప్యూటీ సీఎం కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాట మార్గం, పోరాట స్ఫూర్తి అందరికీ గుర్తుకు వచ్చే విధంగా సెక్రటేరియట్ ముందు భాగాన విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సెక్రటేరియట్ ఎదురుగా పాపన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించడం స్ఫూర్తిదాయకం అన్నారు. సామాజిక న్యాయానికి, ధర్మానికి పాపన్న విగ్రహం పునాది అన్నారు. ఏమీ లేని రోజుల్లోనే పాపన్న అన్ని కులాలను కలుపుకొని అనుకున్నది సాధించారు వారి మార్గంలో మనందరం అడుగులు వేయాలి అన్నారు. విగ్రహ ఏర్పాటు, సెక్రటేరియట్ ఎదురుగా స్థలాన్ని ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేసింది కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయి, వారికి స్పష్టంగా సందేశం ఇవ్వడం కోసం నిలబడిన ప్రజా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడాలి అన్నారు.