మొక్కలు నాటిన సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల

ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల #Eachoneplantone, #Greenindiachallenge కార్యక్రమంలో భాగంగా పద్మారావు నగర్ లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. హరిత తెలంగాణ కోసం అందరూ మొక్కలు నాటాలని శేఖర్ కమ్ముల కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, స్థానిక నాయకులు, పార్కు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.