క్యాన్సర్ రహిత తెలంగాణ గా మార్చాలి: ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గౌరవ సలహాదారులు నోరి దత్తాత్రేయులు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ లోని సచివాలయంలో ప్రముఖ క్యాన్సర్ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గౌరవ సలహాదారులు నోరి దత్తాత్రేయులుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నోరి దత్తాత్రేయులు రాష్ట్రంలో క్యాన్సర్ నిర్మూలనపై రూపోందించిన పలు అంశాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ICMR నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2025 సంవత్సరానికి 55 వేల కేసులు నమోదు అయ్యో అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ రహిత తెలంగాణ గా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన పలు అంశాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ గారితో చర్చించారు.
రాష్ట్రంలో ఎయే ప్రాంతంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయో వైద్య శాఖ అధికారులు నోటి ఫై చేయాలన్నారు. క్యాన్సర్ బాదితుల డెటా ను నమోదు చేసుకోవాలన్నారు. క్యాన్సర్ నివారణపై పరిశోదన లు నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ బాదితులకు మెరుగైన వైద్య సాయంను రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా సేవలను అందించడాన్ని స్వాగతించారు.

90 శాతం క్యాన్సర్ రోగాలను రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సేవలలో కవర్ అవుతున్నాయన్నారు. నిమ్స్ , MNJ క్యాన్సర్ అసుపత్రులలో మెరుగైన వైద్య సదుపాయాలున్నాయన్నారు. క్యాన్సర్ ను తోలి దశలో గుర్తించేందుకు అన్ని జిల్లా ప్రభుత్వ అసుపత్రులలో క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్తించిన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ లో పాజిటివ్ వచ్చిన బాదితులను గుర్తించి వారిని సూపర్ స్పేషాలిటీ సేవలు అందించే అసుపత్రులకు రిపర్ చేయాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ అసుపత్రులలో క్యాన్సర్ బాదితుల కోసం డే కేర్ సెంటర్ల ను ఏర్పాటు చేయాలని కోరారు.
నిమ్స్ లో క్యాన్సర్ చికిత్స లను అందిస్తున్న సమాచారం ప్రజలకు తెలిసేలా క్యాన్సర్ అవగాహన సదస్సులను నిర్వహించాలి. క్యాన్సర్ పై ప్రతి ఓక్కరికీ అవగాహన ఉండేలా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలి.

క్యాన్సర్ బాదితుల వైద్యం కోసం ప్రతి 100 కిలోమీటర్ల పరిధిలో చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ క్యాన్సర్ బాదితులకు అందిస్తున్న పలు సేవలను మంత్రి దామోదర్ రాజనర్సింహ డాక్టర్ నోరి దత్తాత్రేయులకు వివరించారు. క్యాన్సర్ పై అవగాహన కోసం వర్క్ షాపులను ప్రతి మెడికల్ కాలేజీలో నిర్వహించాలని మంత్రి వైద్య శాఖ అధికారులను అదేశించారు. రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను పెద్ద ఏత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారి ని రేగ్యూలర్ గా క్యాన్సర్ స్ర్కీనింగ్ చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. తోలి దశలో క్యాన్సర్ ను గుర్తించేందుకు వైద్యశాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి అధికారులను అదేశించారు.