రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి (సద్భావన దివస్) సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీ తక్కువ పదవీకాలంలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, సాంకేతికతలో అనేక మార్పులు తీసుకువచ్చి.. ఆధునిక దేశంగా రూపుదిద్దడానికి పునాదులు వేశారని గుర్తుచేశారు.