నీటిపారుదల శాఖ గౌరవ సలహాదారుడిగా హార్పల్‌

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ గౌరవ సలహాదారుడిగా మాజీ సైనికాధికారి, లెఫ్టినెంట్‌ జనరల్‌ హార్పల్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇరిగేషన్‌శాఖలో వివిధ విభాగాల్లోని 44మంది డీఈఈలకు ఈఈలుగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పూర్తిస్థాయి రెగ్యులర్‌ ఈఎన్సీ (జనరల్‌)గా అమ్జద్‌ హుస్సేన్‌ను నియమించింది.