ఉప రాష్ట్రపతి పదవికి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి బీ సుదర్శన్‌ రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. సెప్టెంబర్‌ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో పోటీ పడనున్నారు. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్‌ శరద్‌ పవార్‌ తదితరులు వెంటరాగా, బీ సుదర్శన్‌ రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాల్ని రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.