బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణకే రోల్ మోడల్ గా మారుస్తా: మంత్రి దామోదర్ రాజనర్సింహ

  • మునిపల్లి మండలంలో రూ.70 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
  • నియోజకవర్గంలో విద్యా, వైద్య, రవాణా సౌకర్యాల మెరుగు కు ప్రత్యేక శ్రద్ధ
  • సింగూరును టూరిజం హబ్ గా మారుస్తా
  • కలెక్టర్ పి.ప్రావీణ్య తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

అందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం బుదేరా లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పి . ప్రావిణ్య తో కలిసి అందోల్ నియోజకవర్గ పరిధిలోని మండలంలోని వివిధ గ్రామాలలో రూ.70 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా బుదేరా సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… బుదేరా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపరిచి రానున్న ఆరు నెలల్లో కళాశాలను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు రోల్ మోడల్ గా మార్చేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థులకు భద్రత కల్పించడంతోపాటు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు అధునాతన సౌకర్యాలతో కూడిన ల్యాబ్ లు, డిజిటల్ తరగతి గదులు, మెరుగైన ఫర్నిచర్, లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అనంతరం, మండలంలోని కళాశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుకు కృషి చేయునట్లు తెలిపారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మంత్రి పరిశీలించారు. వెంటనే భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మునిపల్లి మండలం అల్లాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సంక్షేమ పథకాలు అమలుపై సమీక్ష జరిపి గ్రామస్తులతో మాట్లాడారు. తాటి పల్లి నుండి మక్తా కేసరం వరకు రెండు వరసల రోడ్డు నిర్మాణం కోసం 22 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసారు . గార్లపల్లి నుండి తక్కడపల్లి వరకు 17. 70 లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం , సింగూరు బ్యాక్ వాటర్ ప్రాంతం లో నిర్మించనున్న రిసార్ట్ ప్రాంతాన్ని RDO రవీందర్ రెడ్డి , మండల రెవిన్యూ అధికారులు , గ్రామస్థులతో కలసి పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టు టూరిజం హబ్ గా అభివృద్ధి చెందితే ఎగువ ఉన్న గ్రామాలలో ని యువత కు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు . హైదరాబాద్ కు సమీపం లో అతిపెద్ద జలాశయం సింగూరు కు పర్యాటకులు విరివిగా వస్తారన్నారు . ఈ ప్రాంతం లో రవాణా సౌకర్యాలు పెరిగి భూములకు విలువ పెరుగుతుందన్నారు. Singuru ప్రాజక్టు ఎగువ ఉన్న తక్కడపల్లి , గార్లపల్లి , చిల్లపల్లి , మక్తకేసారం , బేలూరు , కళ్లపల్లి , లొనికాల్ , హస్నాబాద్ , కోడూరు , మారడగా , ఇప్పడపల్లి , కార్చల్ , ఇందూర్ , సిరోర్ , సింగీతం , తాటిపల్లి లాంటి ప్రాంతాలు అభివృద్ధి లోకి వస్తాయని మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడించారు .

సింగూర్ ప్రాజెక్టును టూరిస్ట్ హబ్ గా మారుస్తా: మంత్రి దామోదర్ రాజనర్సింహ
త్వరలో సింగూరు ప్రాజెక్ట్ ను టూరిస్ట్ హబ్ గా మార్చనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. మునిపల్లి మండలంలోని గార్లపల్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించిన తర్వాత జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బుదేరా నుండి సీరూరు వరకు సింగూరు బ్యాక్ వాటర్ వెంట రెండు లైన్ల రోడ్డు ఏర్పాటు కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా గార్లపల్లిలో హై లెవెల్ వంతెన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రోడ్డుతో సింగూరు ప్రాజెక్టు వెనుక భాగంలోని రాయికోడ్ మునిపల్లి మండలాలలో గ్రామాలు అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు కు 100 కిలోమీటర్ల లోపు ఉన్న పెద్ద ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు అన్నారు. సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్ గా మార్చడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు సింగూరు ప్రాజెక్టు మధ్యలో రామచంద్రాపురం శివారులో నీట మునుగకుండా ఉన్న 15 ఎకరాల విస్తీర్ణం లోని భూమిలో రిసార్ట్ హోటలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సింగూరు బ్యాక్ వాటర్ వెంట గ్రామాలలో ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలో రిసార్ట్లో ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. హైదరాబాదు నుండి సింగూరు ప్రాజెక్టు చూడడానికి వచ్చే టూరిస్టులు సింగూరు ప్రాజెక్టును చూసి పడవలలో రామచంద్రపురం రిసార్ట్ కు వచ్చి మధ్యాహ్నం భోజనం చేసుకొని రాత్రి సింగూరు బ్యాక్ వాటర్ వెంట వెలిసే రిసార్ట్లలో విశ్రాంతి తీసుకునేలా టూరిస్టు హబ్ ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. బుదేరా సిరూరు రోడ్డు ఏర్పాటుతోపాటు సింగీతం నుండి కోడూరు వరకు రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ రెండు రోడ్ల నిర్మాణంతో సింగూరు బ్యాక్ వాటర్ గ్రామాలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కలగడంతో పాటు ఈ ప్రాంతం టూరిస్ట్ హబ్ గా మారనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

రూ. 70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి:
మునిపల్లి పర్యటన సందర్భంగా మంత్రి మండలంలో ని వివిధ గ్రామాలలో
రూ. 70 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి. 2.20 కోట్లతో సాంఘీక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, బుదేర లో ఆదనపు తరగతి గదులు మరియు ప్రహారీ గోడ నిర్మాణం. 43 లక్షలతో కళాశాలలో మౌళిక సదుపాయాలు.

98 లక్షలతో మునిపల్లి-ఖమ్మంపల్లి బి.టి. రోడ్డు నిర్మాణం
1.24 కోట్లతో మోడల్ స్కూల్, మునిపల్లిలో చేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.
34.50 లక్షలతో యస్.సి. బాయ్స్ హాస్టల్, మునిపల్లిలో పలు అభివృద్ధి పనులు
1.96 కోట్లతో మునిపల్లి చందాపూర్ బి.టి.రోడ్డు నిర్మాణం
1.26 కోట్లతో పి.డబ్ల్యుడి రోడ్డు – తక్కెడల్లి బి.టి. రోడ్డు నిర్మాణం.
57.50 లక్షలతో కె.జి.బి.వి. తాటిపల్లి లో మౌళిక సదుపాయాలు,
37 లక్షలతో నిర్మించిన వంటశాల, ఇతర మరమ్మత్తులకు ప్రారంభోత్సవం
42 కోట్లతో తాటిపల్లి-మక్తక్యాసారం డబల్ రోడ్డు నిర్మాణం,
17 కోట్లతో గార్లపల్లిలో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ కలెక్టర్ పి ప్రావీణ్య త తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల చైర్మన్ అంజయ్య, సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, పంచాయతీరాజ్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్, వివిధ శాఖల సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు