కాలుష్యకారక పరిశ్రమలపై సర్వే

హైకోర్టు ఆదేశాలనుసారం తనిఖీ చేసిన లీగల్ సర్వీసెస్ అథారిటీ
పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తాం – పుష్కేందర్ కౌర్
రాష్ట్ర లీగల్ అథారిటీ హైకోర్టు మెంబర్ సెక్రటరీ సుభ్రమణ్యం బృందం సోమవారం శాస్త్రిపురం డివిజన్ లోని శాస్త్రిపురం, కింగ్స్ కాలనీ, దానమ్మహట్స్ బస్తీల్లో సర్వే నిర్వహించింది. స్థానికంగా కార్ఖానాలకు అధికారులు అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని, దాంతో కాలుష్యం బారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు 2012లో శాస్త్రిపురం వినయ్ పల్వేటికర్, ఎం.ఎ.రషీద్ లు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మైలార్ దేవుపల్లి ఠాణా ఇన్ స్పెక్టర్ సత్తయ్య సిబ్బందితో కలిసి సర్వే బృందం సభ్యులకు బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో సుబ్రమణ్యం బృందం పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి వివరాలను నివేదికలో పొందుపరిచారు.