వినాయక చవితి పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించి ఆ విఘ్నేశ్వరుడు ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండేలా చూడాలని ప్రార్ధించారు.
ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని, వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి వినాయకులకు ప్రాముఖ్యతను ఇవ్వాలని తెలిపారు. దీనివల్ల వాతావరణ సమతుల్యంతో పాటు,వినాయకులను నిమజ్జనం చేసే చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల అన్ని రకాలుగా హానికరమని అన్నారు. ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మరొక్కమారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
